AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బట్టల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. స్థానికుల్లో టెన్షన్

హైదరాబాద్‌ హబ్సిగూడలో ఇవాళ ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అన్‌లిమిటెడ్ షాపింగ్ మాల్‌లో ఉన్నట్లుండి మంటలు చేలరాగాయి. దీంతో చుట్టుపక్కల మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మూడు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా, షాపింగ్ మాల్ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే షాపింగ్ మాల్‌లోని రెండు ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. షాపింగ్ మాల్‌లో దుస్తువులు తగలబడి భారీగా నష్టమే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చునని అగ్నిమాపక అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

ANN TOP 10