AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొల్హాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్..

బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్‌కు ఈ రోజు మధ్యాహ్నం చేరుకున్నారు. కేసీఆర్‌కు బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్, దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొల్హాపూర్ నుంచి నేరుగా అంబాబాయి దేవాల‌యానికి చేరుకున్న సీఎం కేసీఆర్ అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వేద పండితులు కేసీఆర్‌ను ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు.

ANN TOP 10