కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి డిమాండ్
వరద ప్రాంతాల్లో కంది శ్రీనన్న పర్యటన
బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ
ఆదిలాబాద్: వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు జోగురామన్న తక్షణమే ఇంటికి 25వేల నష్టపరిహారాన్ని అందించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేసారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల ముంపుకు గురయిన ప్రాంతాలలో ఆయన పర్యటించారు. బేల మండలంలోని పాత సాంగ్డి, కొత్త సాంగ్డి గ్రామాలలో వరదలకు మునిగిన పంట పొలాలలను, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. కంది శ్రీనివాస రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు. పెన్ గంగా నది పరీవాహక ప్రాంతాలలో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పంట నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరాకు 25వేల రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని ఎమ్మెల్యే జోగురామన్నను డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో గిమ్మ సంతోష్, మాజీ జెడ్పీటీసీ రాందాస్ నాక్లే, బేలా మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండవార్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు మాడవి చంద్రకాంత్, సామా నర్సారెడ్డి, దయాకర్ పటేల్, కత్తూరి లాస్మన్న, సుధాకర్, సుందర్ లాల్, సామా తిరుపతి రెడ్డి,వసంత్, ఎల్మా దేవరెడ్డి, నాగర్కర్ శంకర్, విలాస్ సవాపూర్, షకీల్, ఐఎన్‌టీయూసీ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ కొండూరి రవి, మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ మోసిన్ పటేల్,వసీమ్ రంజాని,మానే శంకర్, లింగన్న, ముఖీమ్,షేక్ షహీద్, ప్రకాష్ రెడ్డి, జలీల్, అస్బాత్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.









