సినీ నటి మాళవిక మోహన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. తెలుగు, తమిళ్ లో రిలీజ్ అయిన మాస్టర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ భామ. అంతకు ముందు మలయాళంలో పలు సినిమాల్లో నటించింది మాళవిక. ఈ క్రమంలోనే తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంది. ఇప్పుడు తెలుగులోనూ సినిమాలు చేస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక క్రేజీ కామెంట్స్ చేసింది. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేయాలనుకుంటున్నాను. నా పాత్రకు స్కోప్ లేకపోతే అది రూ.500 కోట్ల భారీ బడ్జెట్ మూవీ అయినా సరే నటించను అని చెప్పడం గమనార్హం.









