AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జీటీపీఎల్‌ బ్రాండ్ అంబాసిడర్లుగా కల్యాణ్ ఆర్య, రష్మిక

జీటీపీఎల్‌ కు నటి రష్మిక మందన్న, బాలివుడ్ యువ సూపర్ స్టార్ కార్తిక్ ఆర్యన్ కొత్త అంబాసిడర్లుగా వ్యవహరిస్తారని ప్రముఖ వైర్ బ్రాండ్ సంస్థ, భారత్ అతిపెద్ద మల్టీ సిస్టమ్ ఆపరేటర్ (ఎంఎస్ఓ) జీటీపీఎల్‌ ప్రకటించింది. బహుముఖ ప్రజ్నాశాలి, ఎన్నో అవార్డులు గెలుచుకున్నప్రసిద్ధ బాలివుడ్ నటుడు కార్తిక్, అలాగే కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న నటి రష్మిక మందన్న ప్రముఖు కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎన్నుకున్నాయి. డిజిటల్, ఔట్ డోర్, టివి మాద్యమాల్లో జీటీపీఎల్‌ తీయనున్న ప్రకటనల్లో కార్తిక్ ఆర్యన్, రష్మిక మందన్న నటించనున్నారు.

పాత కాలపు సాంకేతిక తొలగించడంతోపాటు డిజిటల్ టివి కేబుల్ ను బలోపేతం చేయడమే సంస్థ ప్రచార లక్ష్యం. జీటీపీఎల్‌ కనెక్షన్ ద్వారా అత్యంత నాణ్యమైన హెచ్ డి డిజిటల్ కేబిల్ టీవీ, హై బ్రాండ్ బ్రాండ్, ఓటీటీ సేవలకు సంబంధించింది. ఈ సందర్భంగా జీటీపీఎల్‌ మేనేజింగ్ డైరెక్టర్ అనురుద్ సిన్హా మాట్లాడుతూ ‘రష్మిక మందన్న, కార్తిక్ ఆర్యన్ బ్రాండ్ అంబాసిర్లుగా రావడం సంతోషంగా ఉంది. వారిద్దరూ చలాకీ నటులు, ప్రేక్షకులను ఆకట్టుకునే పనితనం ఎలా ఉంటుందో మా బ్రాండ్ బాండ్ సేవలు కూడా అలా ఉంటాయి.

మా బ్రాండ్ ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు వారితో పనిచేసేందుకు ఎదురు చూస్తున్నాం.’
బ్రాండ్ అంబాసిడర్ కార్తిక్ ఆర్యన్ మాట్లాడుతూ ‘నేను జీటీపీఎల్‌కి ఎంపికవడం సంతోషంగా ఉంది. ఈ బ్రాండ్ నాణ్యత, ఆవిష్కరణ కు పేరు. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ కావడం గర్వంగా ఉంది. బ్రాండ్ విలువపై నాకు నమ్మకం ఉంది. ఈ సంస్థతో పనిచేసేందుకు ఎదురు చూస్తున్నా.’
రష్మిక మందన్న ఇలా వ్యాఖ్యానించింది. ‘నేను జిటిపిల్ కు అంబాసిడర్ కావడం సంతోషంగా ఉంది. వినోదం, సమాచారంతో ఖాతాదారులకు నమ్మకమైన, నాణ్యమైన సేవలతో ప్రేక్షకులకు దగ్గరవుతామని భావిస్తున్నా. సంస్థతో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని అన్నారు.

ANN TOP 10