తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన మంత్రివర్గ మండలి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశమై చర్చించింది. త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నది. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.
మెట్రో విస్తరణ, ఎయిర్‌పోర్టు.. అభివృద్ధి ఇలా ఎన్నో కీలక విషయాలు.. ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనం చేస్తూ.. తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసింది. వచ్చే అసెంబ్లీ సెషన్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. తెలంగాణ మంత్రి మండలి సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీని విలీనం చేయనున్నామని.. వచ్చే అసెంబ్లీ సెషన్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆర్టీసీని కాపాడేందుకు, ప్రజారవాణాను పటిష్టపరిచేందుకు.. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తాం.. కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తున్నాం ఆగస్ట్ 3న ప్రారంభమయ్యే సమావేశాల్లో.. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల బిల్లును ప్రవేశపెడుతున్నామంటూ పేర్కొన్నారు.









