AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆరోగ్య పరిరక్షణ కోసం .. చెట్టు – బొట్టు

ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మొక్కల పెంపకం ఎంతో అవసరం ఉందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి చెట్టు – బొట్టుగా పేరు పెట్టామని, తెలంగాణలో మొక్కల పెంపకం ద్వారా 7.4 శాతం గ్రీన్ కవర్ పెంపొందించిన ఒకే ఒక రాష్ట్రం మనది అని ప్రశంసించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆస్పత్రులు కట్టడం కాదని, వ్యాధులు రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించడంతోనే ఊపిరితిత్తులను కాపాడుకోగలుగుతామని, చెట్లు పెంచడం ద్వారా అన్ని రకాలుగా ఆరోగ్య అభివృద్ధి జరుగుతుందని హరీష్ రావు వివరించారు.

ANN TOP 10