AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రెండు నెలల చిన్నారిపై పిచ్చికుక్క దాడి..

ఓ పిచ్చి కుక్క ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించింది. ఇంట్లో ఉన్న రెండు నెలల చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అంకిరెడ్డిపల్లి తండా గ్రామపంచాయతీ పరిధిలోని గుంటి తాండాలో చోటు చేసుకుంది. గాయపడిన రెండు నెలల చిన్నారిని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళితే.. గుంటి తాండాకు చెందిన సురేష్, జ్యోతి దంపతులు వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తమ రెండు నెలల కుమారుడితో ఇంట్రో నిద్రిస్తుండగా.. ఇంట్లోకి చొరబడ్డ ఓ పిచ్చికుక్క చిన్నారిని గాయపరిచింది. పసికందు ముఖంపై విచక్షణారహితంగా దాడి చేసింది. కుక్క దాడిలో తీవ్ర గాయాలై రక్తమోడుతున్న చిన్నారిని తల్లిదండ్రులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ముఖంపై పిచ్చికుక్క దాడి చేయడంతో 50కి పైగా కుట్లు వేశారు. ఇంకా 21 రోజులు ఆస్పత్రిలో ఉండాలని సుమారు 10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. తామ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.. వైద్య ఖర్చులు భరించలేమని దాతలెవరైనా ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

ANN TOP 10