AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నా భార్య మానసిక సమస్యతో బాధపడుతోంది.. మాజీ మంత్రి నారాయణ తమ్ముడు క్లారిటీ

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణ తనను వేధిస్తున్నాడంటూ ఆయన తమ్ముడు పొంగూరు సుబ్రహ్మణ్యం భార్య ప్రియా పొంగూరు ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. ఈ వీడియోలో నారాయణ తనను హింసించి టార్చర్ పెట్టారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతుండటంతో.. ఎట్టకేలకు నారాయణ తమ్ముడు పొంగూరు సుబ్రహ్మణ్యం సోషల్ మీడియాలో స్పందించారు.

తన భార్యకు సంబంధించి పొంగూరు సుబ్రహ్మణ్యం కీలక విషయాలు బయటపెట్టారు. తన భార్య పొంగూరు ప్రియా మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నారని, మానసిక ఒత్తిడితో ఏవేవో వీడియోలు తీస్తుందని వ్యాఖ్యానించారు. ఆమె తమ కుటుంబంపై మాట్లాడిన వీడియోలను ఎవ్వరూ పట్టించుకోవద్దని సూచించారు. నారాయణపై ఆమె చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, మానసిక సమస్య కారణంగానే ఆమె అలా మాట్లాడుతుందని క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ప్రియ మాట్లాడుతూ.. నారాయణ వ్యక్తిగత విషయాల గురించి కొన్ని వివరాలు బయటపెట్టింది. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని, అయినా తనను అన్నం తీసుకురావాలని కొట్టేవారని ఆరోపించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని ఇబ్బంది పెట్టారని, తన కుటుంబాన్ని కూడా వేధించినట్లు చెప్పుకొచ్చింది. తనను తీవ్రంగా హింసిస్తున్నారని, అర్థరాత్రి సమయంలో కూడా టార్చర్ పెడుతున్నారని సంచలన ఆరోపణలు చేసింది.

ANN TOP 10