AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మళ్లీ భారీ వర్షాలు.. సోమవారం కూడా సెలవు..!?

మళ్లీ వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది. అయితే.. హైదరాబాద్‌లో మాత్రం వర్షం కురిసే ఛాన్స్ లేదని అధికారులు చెబుతుండటంతో నగర ప్రజలు కాసింత ఊపిరిపీల్చుకున్నారు.

మరోవైపు.. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా మీద కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగిన అల్పపీడనం.. అది బలహీనపడి ఒక్కరోజులోనే మరొకటి ఏర్పడటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. ఈ అల్పపీడనం ప్రభావంతతో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు రాష్ట్రంలోని పలుగ్రామాలు రాకపోకలు లేకపోవడం, ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లడానికి, హాస్టల్‌కు వెళ్లడానికి కష్టమవుతుందని.. సోమవారం కూడా సెలవు (Monday Holiday) ప్రకటించాలని స్టూడెంట్స్, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఆగస్టు-01, 02 తారీఖుల్లో వర్షాలున్నాయని వార్తలు వస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత పెరిగినట్లయ్యింది.

ANN TOP 10