నగరంలో జోన్లవారీగా హెచ్చరికలు జారీ
వారం పది రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోన్న భారీ వర్షాలు.. మరో మూడు నుంచి నాలుగు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాలను అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఈరోజు కుంభవృష్టి నమోదయ్యే అవకాశాలు భారీగా కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు బుధవారం వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నగరంలో జోన్లవారీగా హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కూకట్‌పల్లి జోన్‌కు వాతావరణ శాక ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అయితే.. మధ్యాహ్నం నుంచి మొదలై.. రాత్రి వరకు కుంభవృష్టి నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నగరవాసులు.. ఈ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.









