వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ
ముంపు ప్రాంతాల్లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి విస్తృత పర్యటన
ఆదిలాబాద్: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల ముంపునకు గురైన ప్రాంతాలలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి పర్యటించారు. బేల మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. వర్షం పడుతున్నా గ్రామస్తులు డప్పుచప్పుళ్లతో కంది శ్రీనివాస రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పలు ఆలయాలను దర్శించి భక్తులు అందించిన తాంబూర ను మీటారు. గూడ లో వరదధాటికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. కంది శ్రీనివాస రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసారు. గూడ లో పార్టీ తరపున పంటనష్టం పై సర్వే చేసేందుకు వచ్చినట్టు తెలిపారు. ఇళ్లు, పంటపొలాల్లోకి నీళ్లు చేరి నష్టపోయిన బాధితులను కలిసి పరామర్శించారు.

వర్షాల ధాటికి దెబ్బతిన్న రోడ్లను, తడిచిన ధాన్యాన్ని పంటపొలాలలను పరిశీలించారు. గూడలో దాదాపు 900 ఎకరాల పంటనష్టం జరిగినట్టు అంచనా వేశారు. ఎకరానికి 25వేల చొప్పున నష్టపరిహారం తో పాటు వరద ప్రభావిత ప్రాంతాలలో వెంటనే లక్ష రూపాయల రుణ మాఫీ చేయాలని జోగురామన్న ను డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెన్ గంగ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళిక వేస్తే తర్వాత వచ్చిన బీఆర్ ఎస్ ప్రభుత్వం కొరట చెనక బ్యారేజ్ నిర్మాణం చేపట్టిందన్నారు. ఒక వేళ ప్రాజెక్టు కట్టి ఉంటే ఈ వరద ముప్పు తప్పేదన్నారు. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా బ్యారేజి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదన్నారు. 15 ఏళ్లుగా జోగురామన్న అధికారంలో ఉన్న ప్రజలకు ఒరిగిందేమీలేదని అతను రైతు, పేదల ద్రోహి అని ఆరోపించారు. అందుకే అతన్ని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

జోగురామన్నకు గూడలో ఒక్క ఓటు కూడ పడకూడదన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఓటేసి గెలిపించాలని కోరారు. తమ ప్రభుత్వం వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రాందాస్ నాక్లే, మాజీ ఎంపీపీ బాపూరావు హుల్కె, మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వాంకాడే, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండవార్, బేలా మండలం ఎస్.టి సెల్ చైర్మన్ మాడవి చంద్రకాంత్, శంకర్ భోక్రె, సీతారామ్, అయ్యు, దిలీప్ దక్రే, విలాస్, సుఖ్దేవ్, స్వప్నిల్, గీమ్మ సంతోష్, షకీల్, ఓసావార్ సురేష్, గేడం అశోక్, కొండూరి రవి, మానే శంకర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.










