అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
తెలంగాణలో తెలంగాణలో రెడ్ అలర్ట్ చేశారు. భారీ వర్షాలు పడుతున్నాయి. వానలతో జనజీవనం స్తంభించిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నేటి నుంచి మూడు రోజులు హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. రోడ్లతో పాటు దిగువ ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉంది. చెట్లు, కరెంట్ పోల్స్ పడిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. డ్రైనేజీ లు పొంగిపొర్లే అవకాశం ఉండడంతో నీటిని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలన్నారు.ఎలక్ట్రిసిటీ, వాటర్ డిపార్ట్మెంట్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.









