తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనాలు ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి. బుధ, గురు వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు, రేపు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.









