AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీలో విజయశాంతి ట్వీట్స్ కలకలం

తెలంగాణ బీజేపీలో ఆ పార్టీనేత విజయశాంతి చేసిన ట్వీట్స్ కలకలం రేపుతున్నాయి. మణిపూర్ అల్లర్ల ఘటనలో నేరస్థులకు ఉరి శిక్ష వేయాలని రాములమ్మ డిమాండ్‌ చేశారు. మణిపూర్ ఘటన యావత్ దేశం సిగ్గుతో తల దించుకునేలా ఉందని విజయశాంతి అన్నారు. అయితే మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా విజయశాంతి ట్వీట్ ఉందని సొంత పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అలాగే తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మాజీ సీఎం కిరణ్‌ను పిలవటాన్ని కూడా రాములమ్మ తప్పుబట్టినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో బహిరంగ సభ నుంచి మధ్యలోనే విజయశాంతి వెళ్ళిపోయారు. బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించటాన్ని కూడా బీజేపీ నేత తప్పుబట్టారు. దీంతో విజయశాంతి తీరుపై బీజేపీ నేతలే చర్చించుకునే పరిస్థితి నెలకొంది. స్వపక్షంలో విపక్షం మాదిరి విజయశాంతి వ్యవహరిస్తున్నారని కమలం పార్టీలో నేతలు చర్చించుకుంటున్నట్లు సమాచారం.

ANN TOP 10