మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నికల చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలంటూ మంత్రి వేసిన పిటిషన్‌ను హైకోర్టు బెంచ్ కొట్టేసింది. మంత్రిపై వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఎన్నికల అఫిడవిట్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ టాంపర్ చేసి 2018లో పోటీ చేశారని మహబూబూనగర్ నియోజవర్గానికి చెందిన రాఘవేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. దీంతో తన ఎన్నికకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను కొట్టేయాలని శ్రీనివాస్ గౌడ్ సైతం హైకోర్టును ఆశ్రయించారు. రెండు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని పేర్కొంటూ కొట్టేసింది. త్వరలోనే రాఘవేందర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానుంది.









