రామ జన్మ భూమి అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఆలయం సిద్ధమవుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది 2024లో జనవరి 15 నుంచి 24 లోగా ఆలయంలో శ్రీ రామయ్య విగ్రహ సంప్రోక్షణ జరగవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తరపున దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఆహ్వానం పంపించినట్లు తెలుస్తోంది.
దేశంలోని ప్రతి గ్రామంలో ప్రతి దేవాలయంలో ప్రతి పట్టణంలో శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ పోస్టర్‌లను ఏర్పాటు చేస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ తెలిపారు. జనవరి 15- 24 మధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీని తాము సమయాన్ని కోరినట్లు చెప్పారు.
వాల్మీకి రామాయణం, శ్రీమద్ భాగవత పారాయణం : చంపత్ రాయ్ వచ్చే ఏడాది జనవరిలో శ్రీముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించి సమావేశం నిర్వహించినట్లు చంపత్ రాయ్ తెలిపారు. రాముని ఆలయ నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయడానికి అనేక ఆచారాలు జరుగుతున్నాయి.









