కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. పార్టీలోని వివిధ విభాగాల నేతలతో ఆయన సమావేశం కానున్నారు. సంస్థాగత అంశాలపై సమీక్షించనున్నారు. కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు. ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో మిగతా ప్రధాన పార్టీల బాటలోనే బీజేపీ పెద్దలు కూడా ఎన్నికలపై దృష్టి సారించారు. మరోవైపు, త్వరలో బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉండనున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో అమిత్ షా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.









