AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తన ఇంటి పరిసరాలు స్వయంగా శుభ్రం చేసిన మంత్రి హరీష్

కోకాపేట్‌లోని తన నివాసంలో 10 నిముషాలు దోమల నివారణ కోసం ఇంటి పరిసరాల్లో నిల్వ ఉండే నీరును, చెత్తను మంత్రి హరీష్ స్వయంగా శుభ్రం చేశారు. అనంతరం మాట్లాడిన హరీష్ రావు.. ఆరోగ్యమే మహాభాగ్యమని ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం, ఆరోగ్యవంతమైన కుటుంబం సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించి కుటుంబ సమేతంగా ఇంటి పరిసరాలను, నిల్వ ఉండే నీటిని శుభ్రం చేసుకుందామని పిలుపునిచ్చారు.

వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని మరీ ముఖ్యంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకున్నా, నీటి నిల్వ ఉండటం వల్ల దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందని అన్నారు. వాటి ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే దోమల నివారణకు అందరూ కృషి చేయాలని మంత్రి సూచించారు. పూల కుండీలు, కొబ్బరి చిప్పలు వంటి చోట్ల నిలువ ఉండే నీళ్లలో దోమల లార్వా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే ప్రతీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి పిలుపునిచ్చారు.

ANN TOP 10