గ్రేటర్‌ను ముసురు వీడలేదు. ఆది, సోమవారాలు భాగ్యనగరానికి భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఎల్లో అలెర్ట్ (Yellow Alert) కొనసాగుతోంది. 21 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ (Orange Alert) ప్రకటించారు. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. అల్పపీడనం ప్రభావంతో 25, 26 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రధాన రహదారుల దగ్గర వాటరింగ్ పంపులు, సిబ్బంది మోహరింపు వంటి ప్రాథమిక కార్యక్రమాలను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ (SNDP) కార్యక్రమంలో భాగంగా నాలాల బలోపేతం చేయడం వలన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ సంవత్సరం ఇబ్బందులు తప్పుతాయన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా అధికారులు వ్యక్తం చేశారు.