సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు మరోసారి మనసులు దోచుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే తన చేతలతో తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్న హిమాన్షు.. తనలోని సింగింగ్ కళను మరోసారి బయటపెట్టనున్నట్టు ప్రకటించాడు. గతంలోనూ.. గోల్డెన్ అవర్ ఆల్బమ్‌ను ఆలపించి.. అందరి మనసులు దోచుకున్న హిమాన్షు.. మరో కొత్త పాటను పాడినట్టు తెలిపాడు. ఈ కొత్త పాటను ఈ నెల 24న విడుదల చేయనున్నట్టు తన ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించాడు. “నా రెండో పాటను రిలీజ్ చేస్తున్నానని మీతో పంచుకునేందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ సాంగ్ జులై 24న విడుదల చేస్తున్నాం. ఈ పాట కూడా మీ అందరినీ అలరిస్తోందని ఆశిస్తున్నా..” అంటూ హిమాన్షు ట్వీట్ చేశారు. కాగా.. ఈ ట్వీట్‌పై హిమాన్షు తండ్రి మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. తన పాట కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చారు.









