AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బండ్లన్న మళ్లీ హాట్‌ కామెంట్స్‌.. నాలుగు నెలలు భరించాలంటూ..

హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. రోడ్లన్ని జలమయ్యమయ్యాయి. ఫలితంగా రోడ్లు మొత్తం వాహనాలతో నిండిపోయాయి. ఆయా ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. జోరు వానలో వాహనదారులంతా రోడ్లపై ఇబ్బందులు పడాల్సివచ్చింది. అయితే.. దీనిపై నెటిజన్లు, వాహనదారులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండగా.. ప్రత్యేకంగా సినీ నిర్మాత, కాంగ్రెస్‌ లీడర్ బండ్ల గణేష్ స్పందించటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బండ్లన్న ఈ మధ్య పొలిటికల్ విషయాలపై తనదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు.

నగరంలో నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందిపై ట్విట్టర్‌లో ఓ వీడియోను పంచుకున్నారు. కాగా.. ఆ వీడియోతో పాటు.. చేసిన కామెంట్లే ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరం. “ఇది మన హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ నాలుగు నెలల తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్ లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తాం ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలకు చూసుకుంటాం దయచేసి నాలుగు నెలలు భరించండి.” అంటూ.. ట్వీట్ చేశాడు బండ్లన్న.

ANN TOP 10