AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టాయిలెట్‌ కోసం వందేభారత్‌ రైలెక్కి..

టాయిలెట్ కోసం వందే భారత్ రైలు ఎక్కి ఓ ప్రయాణికుడు అందులోనే చిక్కుకుపోయాడు. రైల్వే స్టేషన్‌లో ఉన్న టాయిలెట్స్‌కు వెళ్తే డబ్బులు చెల్లించాల్సి వస్తుందని భావించాడో ఏమో.. ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న వందే భారత్‌ రైలు ఎక్కేశాడు. ఇంతలో ఆ రైలు డోర్లు కాస్త మూసుకుపోయి.. వందే భారత్ పరుగులు పెట్టింది. దీంతో ఖంగుతిన్న ఆ ప్రయాణికుడు.. టాయిలెట్ నుంచి బయటికి వచ్చేసరికి రైలు కదిలింది. దీంతో టీటీఈ వద్దకు వెళ్లి విషయం చెప్పడంతో ఫైన్ వేసి.. తర్వాతి స్టేషన్‌లో దించేశాడు. టాయిలెట్ కోసం వందే భారత్ రైలు ఎక్కిన ఆ ప్రయాణికుడు.. ఫైన్, రానుపోను ఛార్జీలు కలిపి మొత్తం రూ. 6 వేలు సమర్పించుకున్నాడు.

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీకి చెందిన ఓ వ్యక్తికి ఈ అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ నుంచి భోపాల్‌ రైల్వే స్టేషన్‌లో దిగాడు. అక్కడి నుంచి సింగ్రౌలీ వెళ్లేందుకు మరో రైలు కోసం.. భోపాల్ రైల్వే స్టేషన్‌లో వేచి ఉన్నాడు. అయితే అదే సమయంలో ఆ ప్రయాణికుడికి టాయిలెట్ వచ్చింది. ఇంతలో అక్కడికి ఓ వందే భారత్ రైలు వచ్చి ఆగింది. దీంతో రైల్వే స్టేషన్‌లోని టాయిలెట్స్‌లోకి వెళ్తే డబ్బులు చెల్లించాల్సి వస్తుందనుకున్నాడో లేక.. పక్కనే ఉంది కదా అని ప్లాట్‌ఫామ్‌పై ఉన్న వందే భారత్ రైలు ఎక్కేశాడు. అనంతరం అందులోని టాయిలెట్‌లోకి వెళ్లి మూత్రం పోసి బయటికి వచ్చాడు. అయితే అప్పటికే ఆ వందే భారత్ రైలు డోర్లు మూసుకుపోయి.. అది బయల్దేరింది. దీంతో ఆ ప్రయాణికుడు ఆ రైలులోనే చిక్కుకుపోయాడు. ఏం చేయాలో అర్థం కాక.. ఆ రైలులో ఉన్న టీటీఈని కలిశాడు. విషయం మొత్తం తెలుసుకున్న టీటీఈ ఆ ప్రయాణికుడికి ఫైన్ వేసి.. తర్వాతి స్టేషన్‌లో దించేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

ANN TOP 10