AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా

జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం -హైదరాబాద్‌ (జేఎన్‌టీయూహెచ్‌) పరిధిలోని కళాశాలలన్నింటిలో శుక్రవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇంజినీరింగ్‌/బీ ఫార్మసీకి సంబంధించి జరగాల్సిన సెమిస్టర్‌ పరీక్షలను ఈ నెల 26కు రీషెడ్యూల్‌ చేస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం మినహా మిగతా రోజుల్లో జరగాల్సిన పరీక్షలన్నీ గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే యథాతథంగా జరుగుతాయని పేర్కొంటూ జేఎన్‌టీయూహెచ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో గురు, శుక్ర, శనివారాల్లో విద్యా సంస్థలన్నింటికీ సెలువులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ANN TOP 10