AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

24 గంటల కరెంట్‌ చేతకాదు.. కనీసం బడుల బాత్రూములన్నా బాగుచేయండి

నల్గొండ: కరెంట్ 11 గంటల కన్నా ఎక్కువ రావడం లేదని తాను చెప్పడంతోనే నల్గొండ జిల్లాలోని 350 సబ్ స్టేషన్లలో లాగ్ బుక్స్ గుంజుకెళ్లారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన నల్గొండలో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక పరేషాన్‌లో ఉన్నారని, 24 గంటల కరెంటు ఇవ్వడం కేటీఆర్‌కు చేత కాదని.. కనీసం ప్రభుత్వ విద్యాసంస్థల్లోనైనా బాత్రూమ్స్ బాగు చేయించాలని సూచించారు.

ఈ సందర్భంగా హిమాన్ష్ (Himansh)…శభాష్.. అంటూ.. తాతకు, తండ్రికి బుద్ధి చెప్పావని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కన్నీళ్లు పెట్టుకున్న హిమాన్ష్‌ను చూసైనా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. మేము చేసేదే చెబుతామని అన్నారు. ఈ నెల 20న ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సభలో మహిళల కోసం డిక్లరేషన్ చేయబోతున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే వికలాంగులకు రూ.5 వేల పెన్షన్ ఇస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

ANN TOP 10