న్యూఢిల్లీ: భారీ వర్షాలతో యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఫలితంగా మంచినీటికి కటకట నెలకొంది. ఢిల్లీలో యమునా నది 208.48 మీటర్ల ఎత్తులో పొంగిప్రవహిస్తుండడంతో సమీపంలోని అనేక వీధులు, నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. నదికి సమీపంలోని కాలనీల ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.
నది నీటి ప్రవాహం గడచిన 45 సంవత్సరాలలో మొట్టమొదటిసారి 207.49 మీటర్లకు చేరుకుంది. యమునా నది ప్రవాహ స్థాయి పెరిగిపోయిన కారణంగా వజీరాబాద్, చంద్రవల్, ఓక్లాలోని వాటర్ ట్రీట్‌మెంవ ప్లాంట్లు మూతపడ్డాయ.ఇ, దీంతో నగరంలోని కొన్ని ప్రాంతాలకు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిరదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం తెలిపారు. యమునా నది ఒడ్డున ఉన్న వజీరాబాద్ ప్లాంట్‌ను స్వయంగా సందర్శించానని ఆయన తెలిపారు. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే ప్లాంట్లను మళ్లీ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.









