సందడిగా కంది శ్రీనన్న క్యాంపు కార్యాలయం
మేము సైతం అంటూ కదలివస్తున్న ప్రజలు
శ్రీనివాసరెడ్డి సమక్షంలో భారీగా చేరికలు
ఆదిలాబాద్: పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజా సేవాభవన్ నిత్యం ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల రాకతో సందడిగా మారుతోంది. కంది శ్రీనివాస రెడ్డి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యేజోగు రామన్నను ప్రశ్నిస్తున్నతీరు ఆదిలాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం ఆయన పడుతున్న తపన చూసి జనం మేము సైతం నీవెంటే అంటూ కదిలివస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాల నుంచి ప్రతీ రోజూ ప్రజా సేవాభవన్ కు తరలివస్తున్నారు. గ్రామాల పర్యటనలో కంది శ్రీనివాస రెడ్డి బిజీ గా ఉన్నా ఆయన వచ్చేవరకు వేచి ఉండి కంది శ్రీనన్న సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారు.
ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ నుంచి వచ్చిన పలువురు యువకులు కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతీ రోజు తన క్యాంపు కార్యాలయానికి వస్తున్నవారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు కంది శ్రీనివాస రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అందరం కలిసికట్టుగా పార్టీ పటిష్టత కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జోగురామన్న ఆదిలాబాద్ లో ఏ కాలనీలో సరైన వసతులు కల్పించలేదని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. అంతా సమష్టిగా జోగురామన్నను చిత్తుచిత్తుగా ఓడిద్దామన్నారు. తనకు ఒక్క అవకాశమిస్తే ప్రతీ కాలనీలో అవసరమైన వసతులు కల్పించేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో గీమ్మ సంతోష్, డిస్ట్రిక్ట్ మైనారిటీ సెల్ చైర్మన్ షకీల్, రాజ్ మొహమ్మద్, మన్సూర్, మానే శంకర్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.









