హనుమకొండలో బహిరంగ సభ
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వరంగల్ పర్యటన కోసం శనివారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 9.50 నిమిషాలకు హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు మోదీ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10.35 గంటలకు వరంగల్‌కు చేరుకుంటారు. 10.45 గంటల నుంచి 11.20 గంటల వరకు వరంగల్‌లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
అనంతరం ఉదయం 11.30 గంటలకు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.15కి వరంగల్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 1.10 గంటలకు హకీంపేట చేరుకుని విమానంలో ఢిల్లీకి తిరిగి వెళ్తారు. ప్రధాని మోదీ షెడ్యూల్ ఇప్పటికే ఫిక్స్ అవ్వగా.. అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.









