AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వాహనదారులకు ట్రాఫిక్ అలర్ట్.. ప్రధాని మోదీ పర్యటన వేళ ఆంక్షలు

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మోదీ పర్యటన వేళ శనివారం హనుమకొండలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వరంగల్ పోలీసులు వెల్లడించారు.

హుజూరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను చింతగట్టు ఔటర్ రింగ్ రోడ్డు, కరుణాపురం మీదుగా హైదరాబాద్ వైపు మళ్లించనున్నట్లు వరంగల్ పోలీసులు తెలిపారు. ఇక ఖమ్మం వెళ్లే వాహనదారులు కరుణాపురం నుంచి ఇనవోలు-పున్నెల్ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ములుగు, పర్కల్ వైపు నుంచి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్‌ వైపు వెళ్లే వాహనాలను ఓఆర్ఆర్, కరుణాపురం మార్గం వైపు మళ్లించనున్నారు. ఖమ్మం వైపు వెళ్లాల్సిన వెహికల్స్‌ ఇనవోలు, పున్నెల్ క్రాస్‌రోడ్ మీదుగా వెళ్లాలని సూచించారు. ఇక నర్సంపేట నుంచి హైదరాబాద్, కరీంనగర్ వెళ్లాల్సిన వాహనాలను వెంకట్రామ జంక్షన్, పోచమ్మ మైదాన్ జంక్షన్, దేశాయిపేట 80 ఫీట్ రోడ్డు, ఆటోనగర్, హనుమాన్ జంక్షన్, పెద్దమ్మ గుడి, కేయూసీ జంక్షన్, చింతగట్టు ఓఆర్ఆర్ మీదుగా మళ్లింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

ANN TOP 10