AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వివేకానందరెడ్డి హత్య కేసు.. పీఏ పిటిషన్‌ కొట్టివేత

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ ఆయన పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్‌ చేసే అధికారం తనకు కూడా ఉన్నట్టు ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో జోక్యానికి సిద్ధంగా లేమని, వాద, ప్రతివాదుల అభిప్రాయాలు హైకోర్టు ముందే చెప్పుకోవాలని సూచించింది. దీనిపై తమ అభిప్రాయాలతో సంబంధం లేకుండా హైకోర్టు స్వతంత్రంగా తగిన నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. రేపు దీనిపై లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇస్తామని తెలిపింది.

ANN TOP 10