AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్యే రాజయ్య.. సర్పంచ్ నవ్య వివాదంలో బిగ్ ట్విస్ట్

స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్య ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజయ్యపై సర్పంచ్ నవ్య చేసిన వేధింపుల ఆరోపణలో నిజం లేదని పోలీసులు తేల్చారు. ఆధారాలు సమర్పించడంలో ఆమె విఫలమయ్యారని..దీనికి సంబంధించిన నివేదికను జాతీయ మహిళా కమీషన్ కు పంపించనున్నట్టు తెలిపారు. కాగా ఇటీవల సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే రాజయ్యపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ఈ ఆరోపణలను జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌లు సుమోటోగా స్వీకరించాయి. విచారణ చేపట్టి నివేదిక అందించాల్సిందిగా పోలీసు అధికారులను మహిళా కమిషన్ ఆదేశించింది. దీంతో పోలీసులు కూడా నవ్యకు నోటీసులు జారీ చేశారు. ఈనెల 21న రాతపూర్వకంగా పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకా ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే రెండు రోజుల్లో సమర్పించాలని ధర్మసాగర్ సిఐ రమేష్ ఆమెకు నోటీసులు ఇచ్చారు. కానీ ఆమె నుంచి ఎలాంటి ఆధారాలు అందకపోవడంతో ఈ ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు నిర్ధారించారు.

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై జానకి రామ్ సర్పంచ్ కురసవల్లి నవ్య మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన వద్ద ఉన్న ఆడియో రికార్డులు ఇవ్వాలని ఆయన అనుచరులతో ఒత్తిడి చేస్తున్నారని సర్పంచ్ నవ్య ఆరోపించారు. అప్పట్లో చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించిన టేపులు ఇవ్వాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తన భర్తకు మధ్య చిచ్చుపెట్టి ఎమ్మెల్యే రాజయ్య పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజయ్య చేసిన లైంగిక ఆరోపణలు టేపులు బయటపెడతారని నవ్య వెల్లడించారు. రూ.20 లక్షలు ఇస్తా కాంప్రమైజ్ కావాలని తన మధ్యవర్తులతో ఒత్తిడి చేస్తున్నారని నవ్య ఆరోపణలు చేస్తున్నారు.

ANN TOP 10