AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీని అధికారంలోకి తీసుకువస్తారని ఆశిస్తున్నా.. బండి సంజయ్‌

కిషన్ రెడ్డి, ఈటలకు బండి సంజయ్ శుభాకాంక్షలు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. వారి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నానన్నానని ట్విటర్ వేదికగా బండి సంజయ్ పేర్కొన్నారు..

‘‘బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు కిషన్‌రెడ్డి గారికి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారికి అభినందనలు. అనుభవజ్ఞులైన, సమర్థులైన మీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను’’ అని బండి సంజయ్ ట్వీట్‌లో తెలిపారు.

ANN TOP 10