AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఖమ్మం సభ గ్రాండ్‌ సక్సెస్‌.. కాంగ్రెస్‌లో జోష్‌

ఖమ్మం జన గర్జన సభ చూసిన వారందరూ జనవిస్ఫోటనం జరిగిందంటున్నారు. ఈ సభ కాంగ్రెస్‌ శ్రేణుల్లో గొప్ప జోష్‌ను తెచ్చింది. సభ సక్సెస్‌తో కాంగ్రెస్‌ నాయకుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన గర్జనను చూసిన వారందరూ నేల ఈనిందనే అంటున్నారు. పెద్ద ఎత్తున జనాలు తరలిరావడంతో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

నిజానికి కాంగ్రెస్‌ గతంలో ఎన్నో సభలను నిర్వహించింది. అవి హిట్‌ అయిన ఈ స్థాయిలో జనాలు అయితే రాలేదు. సభలు కాబట్టి జనాలను తెచ్చి ఉంటారని అనుకున్నా ఇలా వెల్లువలా వచ్చారు అంటే వారికి ఏ మాత్రం కాంగ్రెస్‌ మీద ప్రేమ లేకపోతే రారు కదా. అంటే తీసుకు వచ్చిన జనాలు కూడా ఉన్నా స్వచ్చందంగా వచ్చిన జనాలు కూడా ఉన్నారని అంటున్నారు.

ఈ సభను చూస్తే ఏ సర్వే అవసరం లేదు అనిపిస్తోంది అని అంటున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ రెండు సార్లు అధికారంలో ఉంది.ఈసారి కాంగ్రెస్‌ కి ఒక చా¯Œ ్స ఇవ్వాలని భావించే వారు ఉంటారు. తెలంగాణా తెచ్చిన పార్టీ అన్న సానుభూతి కూడా ఉంటుంది. ఇటీవలే గద్దర్‌ ప్రజా పార్టీ అన్న దాన్ని పెట్టినా ఖమ్మం సభలో కనిపించారు.

అంతే కాదు రాహుల్‌ గాంధీతో కలసి సభలో పాలుపంచుకున్నారు. ఆయన కాంగ్రెస్‌ లో చేరకపోయినా ఆ పార్టీయే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది అని గట్టిగా నమ్ముతున్నారు. మొత్తానికి అన్నీ మంచి శకునములే అన్నట్లుగా కాంగ్రెస్‌ తెలంగాణాలో గోల్డెన్‌ డేస్‌ రాబోతున్నాయని అని అంటున్నారు.

ANN TOP 10