ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని ఈ డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న విజయోత్సవ సభ ఖమ్మంలోనే ఉంటుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. 1200 మంది ఆత్మబలిదానాలను చూసి సోనియా చలించిపోయారని.. బలిదానాలు చూడలేకే తెలంగాణ ఇచ్చారని రేవంత్ పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని అండమాన్ వరకు తరమాలని రేవంత్ అన్నారు. భట్టి మార్చ్ యాత్రలో దృష్టి కొచ్చిన అంశాలు మేనిఫెస్టో గా ఉంటాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి పునాది వేసింది ఖమ్మం జిల్లానేనని రేవంత్ తెలిపారు.









