AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్, అబిడ్స్, కోఠి, ఫిల్మ్‌నగర్, మోహదీపట్నం, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.

లింగంపల్లి, గచ్చిబౌలి, చందానగర్, షేక్ పేట్, మణికొండ, రాయదుర్గం, గోల్కొండలో వర్షం పడింది. ఖాజా గూడా షేక్ పేట్ మార్గంలో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ANN TOP 10