AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాగోగులు తెలుసుకుంటూ.. భరోసానిస్తూ



బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌ రెడ్డి బస్తీలో పర్యటన
ఖైరతాబాద్‌ నియోజకవర్గం వెంకటేశ్వర కాలనీ డివిజన్‌ గౌరిశంకర్‌ కాలనీ రామాలయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌ రెడ్డి, వెంకటేశ్వర కాలనీ బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఎంజీఆర్‌ దంపతులకు శాలువా కప్పి సన్మానించారు.
అనంతరం మన్నె గోవర్ధ్దన్‌ రెడ్డి.. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి బస్తీలో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన ఉద్యమకారులను కలిసి వారికి శాలువా కప్పి సన్మానించారు.


ANN TOP 10