‘పల్లె పల్లెకు కంది శ్రీనన్న’ నినాదంతో ప్రజల్లో చైతన్యం
ఆదిలాబాద్: గడపగడపకు కాంగ్రెస్.. పల్లె పల్లెకు కంది శ్రీనన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. కంది శ్రీనన్నకు ఊరూరా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాదు.. ‘కాంగ్రెస్ డిక్లరేషన్ల’ పై ప్రజలకు వివరిస్తుండటంతో అంతటా ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే జోగురామన్న అవినీతిని ఎండగడుతున్నారు. ఎమ్మెల్యే భూదందాలు, అవినీతి దందాలు సైతం ప్రజలకు తెలియపరుస్తూ చైతన్యపరస్తున్నారు.
ఈ సారి ఎన్నికల్లో జోగురామన్నకు ఓటుతో బుద్ధి చెప్పాల్సిందేనని, అప్పుడే ఆదిలాబాద్ అభివృద్ధి బాటపడుతుందన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆదిలాబాద్ కు ఏం చేశారని జోగురామన్నను ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఓట్ల కోసం వస్తే ప్రజలు తిరగ బడతరు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమన్నారు. గతంలో ఇండ్లిచ్చింది, భూములిచ్చింది. కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.









