AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైల్లో భోజనం..కర్రీలో బొద్దింక..!

లక్నో: ప్రయాణికులకు నాణ్యమైన భోజనం అందించడంలో ‘ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పోరేషన్‌’ పూర్తిగా విఫలమవుతుందనడానికి నిదర్శనంగా మరో ఘటన జరిగింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రయాణికుడు వెజ్‌ థాలీ కోసం ఆర్డర్‌ చేశాడు. కానీ పార్సిల్‌ విప్పి చూడగానే ఆ ప్రయాణికుడు షాకయ్యాడు. ఎందుకంటే ఆ వెజ్‌ థాలీలోని ఆలూ కర్రీలో ఓ బొద్దింక వచ్చింది. దీన్ని సదరు ప్రయాణికుడు ఫొటో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ ఫొటోకు ‘టేక్‌ లుక్‌ ఎట్‌ ద ఫుడ్‌ సర్వీసెస్‌. గెట్టింగ్‌ యాన్‌ ఇన్‌సెక్ట్‌ ఇన్‌ ద ఫుడ్‌’ అనే టెక్స్టును జతచేశాడు. కాగా, ప్రయాణికుడి ట్వీట్‌పై స్పందించింది. ‘యువర్‌ కంప్లెయింట్‌ హ్యాజ్‌ బీన్‌ రిజిస్టర్డ్‌.. కంప్లెయింట్‌ నంబర్‌ హ్యాజ్‌ బీన్‌ సెంట్‌ త్రూ ఎస్‌ఎంఎస్‌’ అని రిప్లై ఇచ్చింది.

ANN TOP 10