AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం కేసీఆర్ రెండు రోజులు మహారాష్ట్ర పర్యటన..

సీఎం కేసీఆర్ రెండు రోజులు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. సోమ,మంగళలో ఈ పర్యటన కొనసాగుతుంది. సోమవారం విఠలేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. రోడ్డు మార్గాన మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో భారీ కాన్వాయ్‌‌లతో వెళతారు. సోలాపూర్‌లో జరిగే పార్టీ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారు. ఈ సందర్బంగా సోలాపూర్ నేత భగీరథ బాల్కే సహా పలువురు మహారాష్ట్ర నేతలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

తర్వాత దారాశివ్‌ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. పండరిపూర్‌ విటోభ రుక్మిణీ మందిర్‌లో సీఎం కేసీఆర్ పూజలు చేస్తారు. మంగళవారం ఉదయం కేసీఆర్ సోలాపూర్‌లోని పండరీపూర్‌కు చేరుకుంటారు. అక్కడ విఠోభా రుక్మిణి మందిరంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత దారాశివ్‌ జిల్లాలోని శక్తి పీఠం తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మళ్లీ హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు.

ANN TOP 10