ప్రకటించిన సీఎం కేసీఆర్
జగిత్యాల: దేశంలోనే ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. కొండగట్టు పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకుని అనంతరం అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధికి అదనంగా మరో రూ.500కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించామని, మరో రూ.500కోట్లు (మొత్తం రూ.600కోట్లు) కూడా కేటాయించనున్నట్లు తెలిపారు.
ఇవాళ కొండగట్టులో పర్యటించిన సీఎం కేసీఆర్.. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కొండగట్టుకు చేరుకున్న సీఎం.. ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసరాలను పరశీలించారు. అనంతరం ఆలయంలో కలియతిరిగి అధికారులకు పలు సూచనలు చేశారు. కొండపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, సీతమ్మ కన్నీటిధార, బేతాళస్వామి ఆలయం, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించారు.