వైరల్ అవుతున్న కుటుంబసభ్యులతో ఉన్న నాటి ఫొటోలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు 25 ఏళ్ల కిందట తన కుటుంబసభ్యులతో కలిసి కొండగట్టు క్షేత్రానికి వచ్చిన ఫొటోలు నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్ననాటి కేటీఆర్, కవితను తన వీపుపై ఎక్కించుకొని అక్కడి కొండపై ఆటలతో సేదతీరిన అపురూప దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కుటుంబసభ్యులతో నాడు ఆయన కొండపై సరదాగా గడిపారు. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ నేతగా కొనసాగుతున్న కాలంలో తన కుటుంబసభ్యులతో కలిసి కొండగట్టు క్షేత్రానికి వచ్చారు. అక్కడి కొండపై కుటుంబసభ్యులు, బంధువులతో సరదాగా గడిపారు. నాడు చిన్న పిల్లలైన కేటీఆర్, కవితను వీపుపై ఎక్కించుకొని కాసేపు ఆటలతో సేదతీరారు. తాజాగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో పర్యటించిన కేసీఆర్ ఆంజనేయ స్వామి ఆలయం, పరిసరాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. కొండగట్టు అంజన్న ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా క్షేత్ర అభివృద్ధికి రూ.వంద కోట్లు మంజూరు చేసిన విషయం విదితమే.