AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏకంగా ఇంట్లోనే గంజాయి సాగు.. యువకుడి నిర్వాకం

హైదరాబాద్ నగర శివారులో ఓ యువకుడు ఇంట్లోనే గంజాయి సాగు చేపట్టాడు. గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మెుక్కలు పెంచుతూ.. అక్రమంగా మత్తుపదార్థాలను విక్రయిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజు శర్మ అనే యువకుడు రాజేంద్రనగర్‌ ఫైరింగ్ రేంజ్ సమీపంలోని ఆనంద నగర్ కాలనీలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇంటి ఆవరణలో మెుక్కల పెంచుతున్న రాజు.. వాటి మధ్యలో నిషేదిత గంజాయి మెుక్కలను కూడా పెంచుతున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా మిగతా మెుక్కల మధ్యలో వాటిని గుట్టు చప్పుడు కాకుండా సాగు చేస్తున్నాడు. అనంతరం గంజాయిని అవసరమైన వారికి విక్రయిస్తున్నాడు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాజు శర్మ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఇంటి ఆవరణలో ఏపుగా సుమారు 6 అడుగులు పెరిగిన మెుక్కను చూసి పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. నివాసాలు ఎక్కువగా ఉండే కాలనీలో అంత సీక్రెట్‌గా మెుక్కలు పెంచుతుండటం పట్ల విస్మయానికి గురయ్యారు. రాజు శర్మను అదుపులో తీసుకున్న పోలీసులు అతడిని స్టేషన్‌కు తరలించారు. గంజాయి మెుక్కను ధ్వసం చేశారు. ఇటువంటి అసాంఘిక, చట్టవ్యతిరేక కలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ANN TOP 10