AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలి నిరాహార దీక్ష

న్యాయం కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలి పోరాటం కొనసాగుతోంది. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే బాధితురాలు, ఆరిజన్ డైరీ ప్రతినిధి శేజల్ నిరాహార దీక్ష చేపట్టారు. దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.

కాగా… ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రభుత్వ భూమిని తన భూమంటూ తమకు అమ్మడంతో పాటు లైంగికంగా తనను వేధించారని శేజల్ ఆరోపించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఇదే విషయంపై శేజల్ తెలంగాణ భవన్‌ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే తోటి వారు స్పందించి శేజల్‌ను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత కూడా శేజల్ తన పోరాటానికి కొనసాగించారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని సీబీఐకి ఫిర్యాదు చేశారు. మహిళా దినోత్సవం రోజు ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ చిత్రపటానికి శేజల్ పాలాభిషేకం చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని కోరారు. దశబ్ది ఉత్సవాలలో భాగంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలపై లైంగిక వేధింపులు చేసిన చిన్నయ్యని సస్పెండ్ చెయ్యాలని శేజల్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమం కోసం ఎన్నో చేస్తున్నారని.. కానీ తమకు జరిగిన అన్యాయంపై పోరాడుతుంటే ముఖ్యమంత్రి స్పందించడం లేదన్నారు. దుర్గం చిన్నయ్యపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. నిరసన తెలపడంతో భాగంగా పాలాభిషేకం చేసినట్లు తెలిపారు.

ఆ తరువాత కూడా శేజల్ ఏదో ఒక విధంగా తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలంటూ పోలీసులు కూడా తనపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. బెల్లంపల్లి పోలీసులు దొంగలకు సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రోజుల పాటు అక్రమంగా కిడ్నాప్ చేసి ఆధారాలు తీసుకుని, తమపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ANN TOP 10