AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పర్యాటకులకు గుడ్‌న్యూస్.. జూపార్క్, నేషనల్ ఫారెస్ట్‌ల్లోకి ఫ్రీ ఎంట్రీ

తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ‘హరితోత్సవం’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్ పర్యాటకులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని జూపార్కులు, అర్బన్ పార్కులు సందర్శించాలనుకునేవారికి నిజంగా ఇంది తీయ్యటి వార్తే అని చెప్పుకొచ్చు.

ఉత్సవాల్లో భాగంగా ఇవాళ (జూన్ 19) రాష్ట్రంలోని అన్ని జూపార్కులు, జాతీయ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లోకి ఫ్రీ ఎంట్రీ అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్‌ఎం డోబ్రియాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకృతితో విద్యార్థుల అనుబంధాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ‘హరితోత్సవం’ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు, అన్ని జిల్లాల్లో అధికారులు వారి వారి ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి పల్లె నుంచి పట్న వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు విస్తృతంగా మెక్కలు నాటాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టూరిస్టులు ఫ్రీగా జూపార్కులు, అర్బన్ పార్కులను సందర్శించే వీలు ఉంది.

ANN TOP 10