AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్ పాతబస్తీలో కాల్పుల కలకలం

హైదరాబాద్ పాతబస్తీలో కాల్పుల కలకలం రేపాయి. పాతబస్తీలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. మగర్ కీ బోలి ఏరియాలో భూ వివాదానికి సంబంధించి కాల్పులు చోటు చేసుకున్నాయి. మసూద్ ఆలీ అనే న్యాయవాది జరిపిన కాల్పుల్లో అనేక వాహనాలు ధ్వంసం అయ్యాయి. భూ వివాదంలో భాగస్వాములు, కొనుగోలుదారుల మధ్య గొడవ చోటు చేసుకున్నట్లు తెలిసింది.

మహిళలు సైతం కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తితో పాటు భాగస్వాములను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ గన్ ఫైరింగ్ లో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని పోలీసులు ప్రకటించారు. అలాగే, ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు.

ANN TOP 10