కథా రచయిత కీర్తి సాగర్ ఒక్క ఛాన్స్ అంటూ సినిమా కార్యాలయాల చుట్టూ తిరిగాడు. వందలాది కథలు రాసి అవకాశాల కోసం ఎదురు చూశాడు. అయితే తాను రాసిన కథలు ఎవరూ వినడం లేదన్న బాధతో కథా రచయిత కీర్తి సాగర్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. చివరికి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని గది నిండా కథలు ఉన్నాయి. మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు ఎవరూ లేకపోవడంతో పోలీసులు మార్చురీలో ఉంచారు. ఫిలిమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.









