AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వందేభారత్‌ ప్రయాణికులకు ముఖ్య గమనిక.. విశాఖ వెళ్లే రైలు ఆలస్యం..

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు ముఖ్య గమనిక. గత రెండు రోజులుగా సికింద్రాబాద్-విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇవాళ ఉదయం 5.45 గంటలకు విశాఖ నుంచి బయల్దేరాల్సిన వందేభారత్ లేటులో నడుస్తుండగా.. మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి తిరిగి బయల్దేరే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఆలస్యంగానే నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. 20834 ట్రైన్ నెంబర్ సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ జూన్ 15న మధ్యాహ్నం 3 గంటలకు బదులుగా రాత్రి 8 గంటలకు మొదలవుతుందని రైల్వే అధికారులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ANN TOP 10