AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహిళల పేరిట వేడుక చేసే అర్హత బీఆర్ఎస్ కు లేదు

బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం పట్ల రాములమ్మ తనదైన రీతిలో స్పందించారు. అసలు మహిళల పేరిట వేడుక చేసే అర్హత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందా అంటూ విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా రాములమ్మ విమర్శనాస్త్రాలు సంధించారు.

‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదో సంవత్సరం అయితుందన్నట్టు కేసీఆర్ సర్కారు ఆర్భాటంగా దశాబ్ది సంబురాలు చేస్తోంది. 21 రోజుల పాటు రకరకాల పేర్లతో వేడుకలు జరుపుతోంది. ఇందులో భాగంగా నేడు మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. నిజం చెప్పాలంటే మహిళల పేరిట వేడుక చేసే అర్హత బీఆరెస్ సర్కారుకి ఏ మాత్రం లేదు. 2014లో మొదటి విడత కేసీఆర్ సర్కారు ఏర్పడినప్పుడు మంత్రివర్గంలో ఒక్క మహిళకి కూడా చోటు దక్కలేదు.

2019లో రెండో విడత సర్కారు ఏర్పాటయ్యాక విమర్శల్ని తట్టుకోలేక మంత్రివర్గంలో మహిళలకి చోటిచ్చారు. ఇక రాష్ట్రంలో మహిళలను కాపాడేందుకు షీ టీమ్స్ ఏర్పాటు చేశామని పదే పదే గొప్పగా చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్… తమ పార్టీలోని మహిళలని కూడా వేధింపుల నుంచి కాపాడలేని దుస్థితిలో ఉన్నారు. స్వంత పార్టీ ఎమ్మెల్యే చేతిలో చేదు అనుభవానికి గురైన ఒక మహిళా సర్పంచి ఉదంతం.. నిన్నగాక మొన్న మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఢిల్లీలోని తెలంగాణ‌భవన్ వద్ద విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఒక ప్రైయివేట్ సంస్థ ఉద్యోగిని వేదన… ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయంటూ విజయశాంతి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

ANN TOP 10