బిపోర్ జాయ్ పెను తుపాన్ ఇప్పుడు భయపెడుతోంది. దీని ప్రభావంతో గుజరాత్‌కు పెను ముప్పు తప్పదని భారత వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తుపాన్ హెచ్చరికలతో ఇప్పటికే పలు విమానాలను రద్దు చేయగా… భారతీయ రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే కూడా బిపర్ జాయ్ సైక్లోన్‌పై అప్రమత్తమైంది.
పెను తుపాన్ ప్రభావంతో పలు రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పోర్బందర్-సికింద్రాబాద్(19202) ట్రైన్ రాజకోట్ నుంచి బయలుదేరనుంది. ఇక సికింద్రాబాద్-పోర్బందర్(19201) రైలును గతంలో రద్దు చేయగా.. ఇప్పుడు మళ్లీ నడపనున్నారు. ఇక ఓఖా-ట్యూటికోరిన్(19568) ట్రైన్‌ను 16వ తేదీన అందుబాటులో ఉండనుంది.
అటు సికింద్రాబాద్-డోన్ పరిధిలో 12 నుంచి 18వ తేదీ వరకు మెయింటనెన్స్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేశారు. కాచిగూడ-నిజామాబాద్(07596), నిజామాబాద్-కాచిగూడ(07593) ట్రైన్లను 12 నుంచి 18వ తేదీ వరకు రద్దు చేశారు. ఇక డోన్-గుంటూరు(17227) రైలును 13 నుంచి 19వరకు, గుంటూరు-డోన్(17228) రైలును 12 నుంచి 18వరకు, కాచికూడ-నడికూడి(07791), నడికూడి-కాచిగూడ(07792), గుంటూరు-మాచర్ల(07779), మాచర్ల-గుంటూరు(07780) ట్రైన్లను కూడా 18వ తేదీ వరకకు క్యాన్సిల్ చేశారు.









