AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కీసరలో యువ దంపతుల ఆత్మహత్య

మేడ్చల్‌ జిల్లా కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. అహ్మద్‌గూడ రాజీవ్‌ గృహకల్పలో యువ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అంజి (25), వైష్ణవి (22)గా గుర్తించారు. ఆరు నెలల క్రితమే వీరికి వివాహం జరగ్గా.. అంతలోనే బలవన్మరణానికి పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. యువ దంపతుల ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సమస్యలతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా, పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ANN TOP 10